ఓటేసిన స్టాలిన్,రజనీ,కమల్

231
stalin
- Advertisement -

త‌మిళ‌నాడు అసెంబ్లీకి ఎన్నిక‌ల పోలింగ్ ప్ర‌క్రియ ప్ర‌శాంతంగా కొన‌సాగుతోంది. డీఎంకే అధినేత స్టాలిన్,సినీ నటులు కమల్ హాసన్,రజనీకాంత్ తదితరులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. థౌజండ్ లైట్స్ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని స్టెల్లా మేరిస్ పోలింగ్ బూత్‌లో ఓటేశారు రజనీకాంత్. చెన్నై హైస్కూల్లో కుమార్తెలు శృతి హాస‌న్, అక్ష‌ర హాస‌న్‌లతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు కమల్.

తేనాంపేటలోని ఎస్‌ఐఈటీ కళాశాలలో ఓటుహక్కు వినియోగించుకున్నారు స్టాలిన్. భార్య దుర్గ, కుమారుడు ఉదయనిధితో కలిసి పోలింగ్‌ కేంద్రానికి వచ్చి ఓటు వేశారు. రాష్ట్రవ్యాప్తంగా భారీగా ప్రజలు పోలింగ్‌ కేంద్రాలకు తరలివస్తున్నట్లు నివేదికలు అందుతున్నాయని…. ఈ ఓట్లన్నీ అధికార పార్టీకి వ్యతిరేకంగానే ఉంటాయన్నారు.

234 అసెంబ్లీ స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీకి మంగళవారం ఒకే విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి. డీఎంకే మాజీ నేత కరుణానిధి, ఏఐఏడీఎంకే చీఫ్‌ జయలలిత మరణానంతరం తొలిసారిగా తమిళనాట ఎన్నికలు జరుగుతున్నాయి.

- Advertisement -