నల్గొండలో పదో తరగతి పేపర్ లీక్ కేసులో 11 మంది అరెస్ట్ కాగా ఆరుగురిని రిమాండ్ చేశారు పోలీసులు. ఈనెల 21న నకిరేకల్ గురుకులంలో ఎగ్జామ్ మొదలైన కాసేపటికే తెలుగు ప్రశ్నాపత్రం లీక్ అయిన కేసులో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు పోలీసులు.
ఏ1 చిట్ల ఆకాశ్, ఏ2 బండి శ్రీనివాస్, ఏ3 చిట్ల శివ, ఏ4 గుడుగుంట్ల శంకర్, ఏ5 బ్రహ్మదేవర రవిశంకర్, ఏ6 మైనర్ బాలుడిని నకిరేకల్ పట్టణంలోని జూనియర్ సివిల్ కోర్టులో జడ్జి ముందు హాజరుపరిచారు పోలీసులు.
జడ్జి ఆదేశాల మేరకు ఆరుగురికి రిమాండ్ విధించి జైలుకు పంపించారు పోలీసులు. నల్గొండలో టెన్త్ పేపర్ లీక్.. చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్‌ను ఉద్యోగం నుండి తొలగించారు. ఇన్విజిలేటర్‌ను సస్పెండ్ చేశారు విద్యాశాఖ.
నకిరేకల్ పట్టణం కడపర్తి రోడ్లోని ఎస్ఎల్బీసీ బాలిక గురుకుల పాఠశాల సెంటర్లో తెలుగు పేపర్ లీక్ వ్యవహారంలో డ్యూటీలో ఉన్న అధికారులను బాధ్యులుగా చేస్తూ వారిపై చర్యలు తీసుకున్నారు విద్యా శాఖ అధికారులు. పేపర్ లీకేజీకి సహకరించిన బాలికను కూడా డిబార్ చేశామన్నారు అధికారులు.
Also Read:బెట్టింగ్ యాప్స్..పోలీస్ విచారణకు శ్యామల