పదో తరగతి పరీక్షలు…సర్వం సిద్ధం

52
ssc
- Advertisement -

నేటి నుండి జూన్ 1 వరకు పదో తరగతి పరీక్షలు ప్రారంభంకానున్నాయి. కరోనా నేపథ్యంలో రెండేళ్ల తర్వాత పదోతరగతి పరీక్షలు జరుగుతుండగా అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఈసారి మొత్తం 5,09,275 మంది విద్యార్థులు టెన్త్ క్లాస్ పరీక్షలు రాస్తున్నారు. పదో తరగతి పరీక్షల కోసం తెలంగాణలో 2,861 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.

ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. పరీక్ష ప్రారంభం అయ్యాక 5 నిమిషాల వరకు అనుమతిస్తారు. ఆ తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైన అనుమతించరు. 70 శాతం సిలబస్ తోనే పరీక్షలు నిర్వహిస్తున్నారు.

ప్రతి పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ద్వారా పరీక్షల సరళిని పర్యవేక్షించనున్నారు.

- Advertisement -