పదోతరగతి పరీక్షలు వాయిదా వేసిన ప్రభుత్వం..

241
ssc exams
- Advertisement -

తెలంగాణలో పదోతరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. హైకోర్టు తీర్పు నేపథ్యంలో పరీక్షలను వాయిదా వేస్తు నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.త్వరలోనే హైకోర్టు గైడ్ లైన్స్ ప్రకారమే ఎగ్జామ్స్ నిర్వహించనుండగా కొత్త తేదీలను ప్రకటించనుంది.

రాష్ట్రమంతటా ఒకేసారి పరీక్షలు నిర్వహించాలని సర్కార్‌ భావించింది.ఇదేవిషయాన్ని హైకోర్టుకు తెలిపింది ప్రభుత్వం. అయితే కరోనా తీవ్రత దృష్ట్యా జీహెచ్‌ఎంసీ మినహా రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో పదో తరగతి పరీక్షలు నిర్వహించుకోవచ్చని ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది.

జీహెచ్ఎంసీ పరిధిలోని విద్యార్ధులను సప్లిమెంటరీ తేదీల్లో ఎగ్జామ్స్ రాసేందుకు అనుమతివ్వాలని వారిని రెగ్యులర్ గా పాస్ అయినట్లు పరిగణించాలని తెలిపింది. ఈ నేపథ్యంలో ఒకేసారి పరీక్షలు నిర్వహించేలా వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.

- Advertisement -