టీమిండియాపై శ్రీలంక ఘన విజయం

176
sl
- Advertisement -

ఆసియా కప్‌లో భారత పోరు దాదాపు ముగిసింది. శ్రీలకంతో జరిగిన కీలకమ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. భారత్ విధించిన 174 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక 19.5 ఓవర్లలో 4 వికెట్లు కొల్పోయి 174 పరుగులు చేసి విజయం సాధించింది.

ఓపెనర్లు పతుమ్‌ నిసాంక (52; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), కుషాల్‌ మెండిస్‌ (37 బంతుల్లో 57; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీలతో రాణించగా దసున్‌ షనక (18 బంతుల్లో 33 నాటౌట్‌; 4 ఫోర్లు, ఒక సిక్సర్‌), భానుక రాజపక్స (25 నాటౌట్‌; 2 సిక్సర్లు) రాణించడంతో లంక గెలుపొందింది.

ఇక అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కొల్పోయి 173 పరుగులు చేసింది. రోహిత్‌ శర్మ (41 బంతుల్లో 72; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించగా సూర్యకుమార్‌ యాదవ్‌ (34) ఫర్వాలేదనిపించాడు. మిగితా బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. దసున్‌ షనకకు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’అవార్డు దక్కింది.

- Advertisement -