శ్రీదేవి టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అన్న మార్క్ లేకుండా మొత్తం ఇండియన్ సినీ పరిశ్రమ మీదనే అందాల, నటనా సంతకం చేసిన నటి. దాదాపు మూడు తరాల అభిమానులని తన వైపుకు తిప్పుకున్న శ్రీదేవి. ఇప్పటికీ వార్తల్లో, సినిమాల్లో తరచూ ఉంటూనే ఉంది. ఆమె మీద వచ్చే ఏ వార్త ఆయినా ఇంట్రస్ట్ గానే చూస్తూంటారు.50 ఏళ్లు దాటినా శ్రీదేవి చాలామందికి అతిలోక సుందరి. ఆమెని అభిమానించే ఫ్యాన్స్ మన దేశంలోనే కాదు విదేశాలలోను ఉన్నారు.
కెరీర్ లో ఎన్నో విజయాలను అందుకున్న శ్రీదేవి లైఫ్ ని సక్సెస్ లోనే రన్ చేసుకుంటూ వచ్చింది. నటనలో డ్యాన్సులో ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె దగ్గర మరో టాలెంట్ కూడా ఉంది. శ్రీదేవికి పెయింటింగ్ అంటే చాలా ఇష్టమట. గత ఐదేళ్ళుగా ఎవరికి తెలియకుండా పెయింటింగ్స్ వేస్తుందట. ఈ అతిలోక సుందరికి చిన్నప్పుడు పేయింటింగ్ అంటే చాలా ఇష్టం ఉన్నా సినిమా కెరీర్ వలన ఆ టాలెంట్ ను అలానే దాచి పెట్టి రీసెంట్ గా మళ్లీ ఆచరణలోకి తెచ్చిందట. బొమ్మలు గీస్తూ నచ్చిన వాళ్ళకి బహుమతిగా కూడా వీటిని ఇస్తుంది.
ఇటీవల తన మరిది కూతురు సోనమ్ కపూర్‌కి అందమైన పెయింటింగ్ వేసి ఇచ్చిందట శ్రీదేవి. దీనికి ఫుల్ ఖుష్ అయిన సోనమ్ తన రూమ్‌లో ఇష్టమైన ప్రదేశంలో ఉంచినట్టు తెలుస్తుంది. ఇక సల్మాన్ ఖాన్, డిజైనర్ మనీష్ మల్హోత్రా వంటి సెలబ్రిటీలకు కూడా తన పెయింటింగ్స్ గిఫ్ట్‌గా ఇచ్చినట్టు సమాచారం. ఒక ఫిల్మ్ ఫెస్టివల్ శ్రీదేవి పెయింటింగ్ ను వేలం వెలయడంతో మంచి ఎమౌంట్ దక్కింది. అయితే ఆ డబ్బును కొన్ని మంచి కార్యక్రమాలకు ఉపయోగించారట. మొత్తానికి శ్రీదేవి ఇప్పటి వరకు నటిగానే తెలిసినా ఇప్పుడు ఆమెలోని మరో కోణం బయటపడింది.