బోనీకపూర్ నిర్మాతగా రజనీ మూవీ!

43
rajini
- Advertisement -

మరో యాక్షన్ మూవీతో ప్రేక్షకులను థ్రిల్ చేసేందుకు సిద్ధమయ్యారు రజనీకాంత్. తన 170వ సినిమాను బోనీ కపూర్ నిర్మాణంలో చేయనున్నారు రజనీ. ఈ సినిమాను ప్రతిష్ఠాత్మకంగా భారీ బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ పతాకంపై అగ్ర నిర్మాత కళానిధి మారన్ నిర్మించనున్నారు.

ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఇది ఆయన 169వ సినిమా. కాగా, 170 వ సినిమాకు కూడా సూపర్ స్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

బాలీవుడ్ స్టార్ మేకర్ బోనీకపూర్ తమిళంలో కూడా చిత్రాలు నిర్మిస్తున్నారు. అజిత్ హీరోగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు నిర్మిస్తున్న బోనీ, రజనీ 170 వ సినిమాను నిర్మిస్తున్నారట. దీనికి అరుణ్ రాజా కామరాజ్ దర్శకుడని తెలుస్తోంది. త్వరలో దీనికి సబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడనుంది.

- Advertisement -