పవన్‌ కళ్యాణ్‌ సరసన శ్రీలీల?

243
- Advertisement -

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఏ ముహుర్తానా శ్రీలీలను తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారో గాని… ఈ బ్యూటీ హవా తెలుగు చిత్ర పరిశ్రమలో మామూలుగా లేదు. నిజానికి రాఘవేంద్రరావు పరిచయం చేసిన హీరోయిన్స్ టాప్‌ హీరోయిన్స్‌ గా ఎదిగిన వారే… ఇప్పుడు ఇదే కోవలోకి శ్రీలీల కూడా చేరబోతోందన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఇప్పుడు శ్రీలీల చేస్తున్న సినిమాలను చూస్తే ఆమె ఏ రేంజ్‌ లో దూసుకుపోతోందో మనకు స్పష్టంగా అర్ధమవుతోంది.

ఇటీవలే ఈ ముద్దుగుమ్మ రవితేజ సరసన నటించిన ధమాకా మూవీ ఏ రేంజ్‌ లో హిట్‌ అయిందో మనకు తెలిసిందే. ఈ మూవీలో తన నటనతో ప్రేక్షకులను అలరించింది ఈ బ్యూటీ. దీంతో ఈ అమ్మడి క్రేజ్‌ అమాంతం పెరిగిపోయిందనే చెప్పాలి. ఏకంగా వరుస అవకాశాలతో బిజీగా ఉంది శ్రీలీల. ఇప్పటికే నితిన్‌ సరసన నటిస్తోన్న ఈ అమ్మడు తాజాగా వైష్ణవ్‌తేజ్‌ సరసన ఓ సినిమాలో నటిస్తోన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఏకంగా శ్రీలీల బంఫర్‌ అవకాశాన్ని పొందినట్టు తెలుస్తోంది.

వరుస హిట్‌ సినిమాలతో జోరు మీదున్న శ్రీలీల త్వరలోనే పవర్ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ సరసన ఓ సినిమాలో నటించనున్నట్లు తెలుస్తోంది. పవన్‌ కల్యాణ్‌, దర్శకుడు సుజిత్‌ కాంబినేషన్‌ లో రాబోతున్న మూవీలో హీరోయిన్‌ గా శ్రీలీలను అనుకుంటున్నారని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం పవన్‌ కల్యాణ్‌ హరిహరవీరమల్లు సినిమాతో బిజీగా ఉన్నారు. తర్వాత హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ సినిమా షూటింగ్‌ లో పాల్గొననున్నారు. ఆ తర్వాత సుజీత్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్‌ గా శ్రీలీలను పెడతారని టాక్‌ వినిపిస్తోంది. శ్రీలీలతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ సినిమాలో నటించడానికి శ్రీలీల భారీగానే డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పవన్‌ సరసన శ్రీలీల నటిస్తే… ఆమె రేంజ్‌ అమాంతం పెరగడం ఖాయమని, టాలీవుడ్‌ లో నే స్టార్‌ హీరోయిన్‌ అవడం పక్కా అన్న టాక్‌ కూడా వినిపిస్తోంది. మరీ పవన్‌ కల్యాణ్‌, సుజిత్‌ కాంబోలో రాబోతున్న ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్ గా ఉండనుందా లేదా అన్నదితెలియాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే.

ఇవి కూడా చదవండి 

కన్నీరుపెట్టిన అవికాగోర్‌… ఎందుకంటే?

మళ్లీ మొదలెట్టిన అనసూయ….

త్వరలో శర్వానంద్‌ పెళ్లి?

- Advertisement -