కన్నీరుపెట్టిన అవికాగోర్‌… ఎందుకంటే?

315
- Advertisement -

పెళ్లికూతురు సీరియల్‌ తో బుల్లితెరపై సెన్సేషన్‌ క్రియేట్‌ చేసి… కోట్లాది మంది తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నఅవికాగోర్‌… ఉయ్యాల జంపాల సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సంగతి తెలిసిందే. కెరియర్‌ ప్రారంభంలో టాలీవుడ్ లో హిట్‌ చిత్రాల్లో నటించిన అవికాగోర్‌ ఆతర్వాత అడపాదడపా సినిమాల్లో నటిస్తోంది. అయితే తెలుగు అమ్మాయిలా కనిపించే అవికాగోర్‌… హోమ్లీ సినిమాల్లోనే నటిస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఇదిలా ఉంటే… తాజాగా ఈ ముద్దుగుమ్మ… తెలుగులో పాప్‌ కార్న్‌ సినిమాలో నటిస్తోంది. సాయిరోనక్‌ హీరోగా నటించిన ఈ సినిమాలో అవికాగోర్‌ నటించింది. ఈ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ పీవీఆర్‌ ఆర్‌కే సినీ ప్లెక్స్‌ లో అట్టహాసంగా జరిగింది. ఈ ట్రైలర్‌ ను టాలీవుడ్‌ హీరో అక్కినేని నాగార్జున లాంచ్‌ చేశారు. ఈ సందర్భంగా హీరోయిన్‌ అవికాగోర్‌ ఎమోషనల్‌ అయింది. తాను ముంబై నుంచి వచ్చానని, ముంబై అయ్మాయి అయినా తనను తెలుగు ప్రేక్షకులు ఆదరించారని… తమ సొంత అమ్మాయిలా గుండెల్లో పెట్టుకున్నారని, తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాలు మరువలేనివని అవికాగోర్‌ అన్నారు. ఒక్కసారిగా అవికాగోర్‌ బోరున విలపించడంతో అక్కడున్నవారు ఒకింత షాక్‌ గురయ్యారు.

- Advertisement -