మళ్లీ మొదలెట్టిన అనసూయ….

92
- Advertisement -

2022 సంవత్సరానికి బైబై చెప్పేసి… 2023 సంవత్సరానికి ఘనస్వాగతం పలికాం… పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ.. కొత్త జీవితానికి నాంది పలికాం.. 2022 సంవత్సరంలో జరిగిన చేదు జ్ఞాపకాలను మర్చిపోయాం.. కానీ యాంకర్‌ అనసూయ మాత్రం.. 2022 సంవత్సరంలో మాదిరిగానే.. 2023 సంవత్సరం ప్రారంభంలోనే తన సహజత్వాన్ని చూపిస్తోంది. 2023 సంవత్సరాన్ని యాంకర్‌ అనసూయ కొత్తగా ప్రారంభించింది. ఎప్పుడూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌ గా ఉండే అనసూయ… పోటోలు షేర్‌ చేస్తూ తన అభిమానులతో పాటు నెటిజన్లను ఫిదా చేస్తోందన్న సంగతితెలిసిందే.

అయితే… తాజాగా అనసూయ తన ఇన్‌ స్టా లో పోస్ట్ చేసిన పోటోలు ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి. అయితే ఈ మధ్య కాలంలో జబర్థస్త్‌ మానేసిన తర్వాత అనసూయకు పెద్దగా అవకాశాలు లేవని.. అడపాదడపా టీవీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నా.. అంతగా బిజీగా ఉండడం లేదని.. మరోవైపు సినిమాల్లో అవకాశాలు సైతం అనసూయకు తగ్గిపోయాయనన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. అనసూయ ఇప్పుడు ఇన్‌ స్టాలో పెట్టిన పోస్టు తెగ వైరల్‌ అవుతోంది.

కొత్త సంవత్సరంలో కొత్త జీవితాన్ని ప్రారంభించానని.. “న్యూ ఇయర్లో ..న్యూ సెల్ఫీ ..న్యూ ఫ్లైట్.. న్యూ అసైన్మెంట్ ” అంటూ క్యాప్షన్ ఇస్తూ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కి సంబంధించిన పనులను చెప్పుకొచ్చింది అనసూయ. ఈ పోస్టు ద్వారా అనసూయకు అవకాశాలు తగ్గాయని అని ప్రచారం చేస్తున్నవారికి గట్టిగా కౌంటర్‌ ఇచ్చిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. సహజంగానే సోషల్‌ మీడియాలో అనసూయ తనను ట్రోల్‌ చేస్తున్నవారికి గట్టిగానే కౌంటర్‌ ఇస్తూ.. వారిని ఎడాపెడా వాయించేస్తుందన్న సంగతి తెలిసిందే. ఈ పోస్టుతో అనసూయ మళ్లీ ఫాంలోకి వచ్చిందని.. సోషల్‌ మీడియా వేదికగా మళ్లీ జూలు విదిల్చి తన ట్రోలర్స్‌ కు గట్టి వార్నింగ్‌ ఇచ్చిందన్న ప్రచారం కూడా సాగుతోంది. మరి ముందు ముందు అనసూయ తన కాంట్రవర్సీ వ్యవహారాలతో ఏ మేరకు వార్తల్లో నిలుస్తోందో చూడాలి.

- Advertisement -