బాలయ్యపై శృతి షాకింగ్‌ కామెంట్స్‌

103
- Advertisement -

సంక్రాంతి వచ్చిందంటే చాలు.. సినిమా అభిమానులకు పండగనే చెప్పాలి. సంక్రాంతి పండగకు సహజంగానే సినిమాలు రిలీజ్‌ అవుతాయన్నది అందరికి తెలిసిన విషయమే కానీ.. ఈ సంక్రాంతికి ఓ స్పెషల్‌ ఉండబోతోంది. టాలీవుడ్ స్టార్‌ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ నటించిన వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలతో పాటు తమిళ్‌ హీరో విజయ్‌ నటించిన వారసుడు మూవీ కూడా ఈ సంక్రాంతి బరిలో నిలవబోతోంది. ఈ మూడు సినిమాల్లో ఏ సినిమా హిట్‌ కొడుతోంది అన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికే చిరంజీవి, బాలకృష్ణలు తమ సినిమా ప్రమోషన్స్‌ లో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగానే శృతి హాసన్‌ సినిమా ప్రమోషన్స్‌ లో పాల్గొన్నారు.

అసలు విషయమేమంటే.. శృతి హాసన్‌ అటు చిరంజీవి సరసన వాల్తేరు వీరయ్య సినిమాలో, ఇటు బాలకృష్ణ సరసన వీరసింహారెడ్డి సినిమాలో నటిస్తోంది. ఈ రెండు సినిమా ప్రమోషన్స్‌ లో శృతి హాసన్‌ పాల్గొంటుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో శృతి హాసన్‌ పలు విషయాలను పంచుకుంది. అయితే ఈ ఇంటర్వ్యూలో ఓ ప్రశ్న ఎదురైంది. అదేంటంటే.. తాను నటించిన హీరోలు బాలకృష్ణ, చిరంజీవిలలో ఎవరు బాగా డ్యాన్స్‌ చేస్తారన్న ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నకు శృతి హాసన్‌ .. మాస్‌ స్టెప్పులు వేయడంలో బాలకృష్ణ సూపర్‌ అని, క్లాస్‌, మాస్‌ డ్యాన్స్‌ లను కలిపి చేయడంలో చిరంజీవి బెస్ట్‌ డ్యాన్సర్‌ అంటూ శృతి హాసన్‌, అటు చిరంజీవి అభిమానులకు, ఇటు బాలకృష్ణ అభిమానులను సంతృప్తి పరిచే సమాధానమిచ్చింది. అయితే ఈ సంక్రాంతి బరిలో నిలుస్తోన్న వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాల్లో ఏ సినిమా హిట్‌ గా నిలుస్తోందనని ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ఇవి కూడా చదవండి 

ఏంటి తమన్నా.. అలా దొరికేసింది..

డాక్టర్స్‌ కమ్‌ టాలీవుడ్ యాక్టర్స్

పవన్‌ కళ్యాణ్‌ సరసన శ్రీలీల?

- Advertisement -