శ్రీలంక నూతన ప్రధానిగా రణిల్ విక్రమసింఘే..

132
Sri Lanka New PM
- Advertisement -

శ్రీలంక నూతన ప్రధానిగా రణిల్‌ విక్రమసింఘే గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. దేశంలో రాజకీయ, ఆర్థిక సంక్షోభం నెలకొన్నది. ఈ క్రమంలో దేశంలో సుస్థిరతను తీసుకునే ప్రయత్నంలో భాగంగా రణిల్‌ విక్రమసింఘేను ప్రధానిగా నియమించినట్లు యునైటెడ్‌ నేషనల్‌ పార్టీకి చెందిన నేతలు తెలిపారు. విక్రమసింఘే ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయడం ఇది ఐదోసారి.

తొలిసారిగా 1993-1994 వరకు ప్రధానిగా పని చేశారు. ఆ తర్వాత 2001-2004, 2015-2018 అక్టోబర్‌ వరకు, 2018 డిసెంబర్‌ నుంచి 2019 ప్రధానిగా సేవలందించారు. నిరసన జ్వాలల్లో భగ్గుమంటున్న శ్రీలంకలో గత కొన్నిరోజులుగా కీలక రాజకీయ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తీవ్ర ఒత్తిడికి తలొగ్గి ప్రధాని పదవి నుంచి మహింద రాజపక్స వైదొలిగారు. ఇప్పుడు నూతన ప్రధానిగా రణిల్ విక్రమసింఘే నియమితులయ్యారు. ఆయన ఈ సాయంత్రం పదవీ ప్రమాణస్వీకారం చేశారు.

- Advertisement -