శ్రీలంకకు తప్పిన మరో ముప్పు..

275
srilanka
- Advertisement -

ఉగ్రదాడితో చిగురుటాకులా వణికిపోయింది శ్రీలంక. ఉగ్రవాదులు సృష్టించిన మారణ హోమానికి వందల మంది ప్రజలు బలయ్యారు. వేల సంఖ్యలో ప్రజలు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా తాజాగా ఇంటలిజెన్స్‌ అప్రమత్తతో శ్రీలంకకు మరో పెను ముప్పు తప్పింది.

కొలంబియా కతునాయకే అంతర్జాతీయ విమానాశ్రయంలో మెయిన్‌ టెర్మినల్‌ రోడ్డులో అతిప్రమాదకరమైన ఐఈడీ పేలుడు పదార్థాలను గుర్తించిన సిబ్బంది బాంబును నిర్వీర్యం చేశారు.

మరోవైపు శ్రీలంక బాంబు పేలుళ్ళ కేసులో దర్యాప్తు ముమ్మరమైంది. 24 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్న శ్రీలంక పోలీసులు13 మందిని అరెస్ట్ చేశారు. వరుస పేలుళ్ళ తర్వాత కొలంబోలో ప్రభుత్వం భద్రతను కట్టుదిట్టం చేసి తనిఖీలు ముమ్మరం చేసింది.

శ్రీలంక బాంబు పేలుళ్ళ ఘటనలో మృతుల సంఖ్య 290కి చేరగా వీరిలో ఐదుగురు భారతీయులు ఉన్నారు. మరణించిన భారతీయుల పేర్లు లక్ష్మి, రమేష్, నారాయణ చంద్రశేఖర్, కేజీ హనుమంతప్ప, ఎం రంగప్ప అని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది.

- Advertisement -