రాజ్ తరుణ్‌…`ఇద్ద‌రి లోకం ఒక‌టే`

378
raj tharun iddarilokam okate movie started

ఎన్నో సూప‌ర్‌డూప‌ర్ హిట్ చిత్రాల‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించిన ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌. ఈ బ్యాన‌ర్‌పై యువ క‌థానాయ‌కుడు రాజ్ త‌రుణ్ హీరోగా `ఇద్ద‌రి లోకం ఒక‌టే` సోమ‌వారం హైద‌రాబాద్‌లో ప్రారంభ‌మైంది. జి.ఆర్‌.కృష్ణ ద‌ర్శ‌కుడు. దిల్‌రాజు, శిరీష్ ఆధ్వ‌ర్యంలో పూజా కార్య‌క్ర‌మాలను నిర్వ‌హించారు. ముహుర్త‌పు స‌న్నివేశానికి వి.విజ‌యేంద్ర ప్ర‌సాద్ క్లాప్ కొట్ట‌గా.. ప్ర‌సాద్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. దిల్‌రాజు మ‌న‌వ‌డు మాస్ట‌ర్ ఆరాన్ష్ గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

dil raju

ఈ సంద‌ర్భంగా… దిల్‌రాజు మాట్లాడుతూ – “`ఇద్ద‌రి లోకం ఒక‌టే` రాజ్‌త‌రుణ్‌తో మా బ్యాన‌ర్‌లో చేస్తోన్న రెండో చిత్రం. జి.ఆర్‌.కృష్ణ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. మిక్కీ జె.మేయర్ సంగీతం అందిస్తుండ‌గా.. స‌మీర్ రెడ్డి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. అబ్బూరి ర‌వి మాట‌ల‌ను అందిస్తున్నారు. యూత్‌, ఫ్యామిలీ ఆడియెన్స్‌కు న‌చ్చేలా సినిమా ఉంటుంది. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన వివ‌రాల‌ను తెలియ‌జేస్తాం“ అన్నారు.

రాజ్‌త‌రుణ్ హీరోగా న‌టిస్తున్న ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం: జి.ఆర్‌.కృష్ణ‌, సంగీతం: మిక్కీ జె.మేయ‌ర్‌, కెమెరా: స‌మీర్ రెడ్డి, డైలాగ్స్‌: అబ్బూరి ర‌వి, ఎడిట‌ర్: త‌మ్మిరాజు