బిగ్ హౌస్‌లోకి సుధీర్-రష్మీ..!

306
sudheer rashmi

తెలుగునాట పాపులర్ రియాల్టీ షో బిగ్ బాస్‌. విజయవంతంగా రెండు సీజన్లు కంప్లీట్ కాగా తాజాగా మూడో సీజన్‌ కోసం ముస్తాబవుతోంది. దాదాపు 100 రోజుల పాటు ఎన్నో వివాదాలు,వినోదాన్ని పంచుతూ అలరిస్తూ వస్తున్న బిగ్‌ బాస్ 3 సీజన్‌ గురించి రోజుకో గాసిప్‌ పుట్టుకొస్తూనే ఉంది.

తాజాగా ఈసారి బిగ్‌బాస్ ఇంట్లోకి వెళ్లే తారల లిస్ట్‌లో బుల్లితెర రొమాంటిక్ జోడీగా ముద్ర పడిన రష్మీ, సుడిగాలి సుధీర్‌ల పేర్లు వినిపిస్తున్నాయి. వీరితో పాటు మరికొంత మంది పేర్లు కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. టీవి నటి హరిత, వరుణ్ సందేశ్, హేమ చంద్ర, హీరో కమల్ కామరాజు, రేణు దేశాయ్, గుత్తా జ్వాల, మనోజ్ నందన్, జబర్దస్త్ పొట్టి రమేష్ , కరాటే కళ్యాణి పేర్లు వినిపిస్తున్నాయి.

ఇక బిగ్ బాస్ మొదటి సీజన్‌కి జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌కాగా, రెండో సీజన్‌లో నానీ తన యాంకరింగ్‌తో అదరగొట్టేసాడు. ఇక మూడో సీజన్‌కి హోస్ట్‌ ఎవరనేది ఇంకా ఫైనల్ కాలేదు. మరోసారి నానీ, ఎన్టీఆర్ పేర్లు వినిపిస్తుండగా చిరంజీవి, రానా, నాగార్జునల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మొత్తంగా త్వరలో ప్రారంభంకాబోయే బిగ్ బాస్ సీజన్‌ 3 కంటెస్టెంట్‌లు ఎవరనేది తెలియాలంటే వేచిచూడాల్సిందే.