ఎలిమినేటర్ లో హైదరాబాద్ గెలుపు

231
srh
- Advertisement -

ఐపీఎల్ 2020లో భాగంగా అబుదాబి వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం సాధించింది. ఆర్సీబీ విధించిన 132 పరుగుల లక్ష్యాన్ని 19.4 ఓవర్లలో వికెట్లు కొల్పోయి 132 పరుగులు చేసి 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు నిర్దేశించిన 132 పరుగుల లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తడబడింది. బెంగళూరు బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో హైదరాబాద్ బ్యాట్స్‌ మెన్ పరుగులు చేయడానికి కష్టపడ్డారు. గోస్వామీ(0), డేవిడ్‌ వార్నర్‌(17),మనీశ్‌ పాండే(24),ప్రయాగ్ (7) తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. అయితే ఓ వైపు వికెట్లు పడుతున్న మరోవైపు ఒంటరిపోరాటం కొనసాగించాడు విలియమ్సన్‌. హాఫ్ సెంచరీతో విలయమ్సన్ జట్టను విజయతీరాలకు చేర్చాడు. హోల్డర్ 24 పరుగులతో రాణించాడు.

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్లు కొల్పోయి 131 పరుగులు చేసింది. ఏబీ డివిలియర్స్‌(56: 43 బంతుల్లో 5ఫోర్లు) ఒక్కడే రాణించడంతో ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది ఆర్సీబీ. అరోన్‌ ఫించ్(32), కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(6) మరోసారి నిరాశపరిచాడు. ఫామ్‌లో ఉన్న దేవదత్‌ పడిక్కల్‌(1),మొయిన్‌ అలీ(0), శివమ్‌ దూబే(8), వాషింగ్టన్‌ సుందర్‌(5) విఫలం కావడంతో కీలక మ్యాచ్‌లో భారీ స్కోరు చేయలేకపోయింది బెంగళూరు.

- Advertisement -