బిగ్ హౌస్‌లోకి ఇండియన్‌ ఐడల్‌ శ్రీరామచంద్ర!

298
- Advertisement -

ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్‌ 5 త్వరలోనే ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించనుండగా ప్రతీ రోజు సోమ‌వారం నుండి శుక్ర‌వారం వ‌ర‌కు రాత్రి 10గం.ల‌కు ఈ షో ప్ర‌సారం కానుండ‌గా, శ‌ని,ఆదివారాల‌లో 9గం.ల‌కు మొద‌లు కానుంది.

ఇప్పటికే బిగ్ బాస్‌ హౌస్‌లోకి వెళ్లే సభ్యులు క్వారంటైన్‌లో ఉండగా రోజుకో పేర్లు వార్తల్లో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే సురేఖవాణి పేరు వినపడగా తాజాగా ఇండియన్ ఐడల్ శ్రీరామచంద్ర పేరు కూడా వినిపిస్తోంది. దీనిపై త్వరలోనే అఫిషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉంది.

ఇక సెప్టెంబర్ 5న బిగ్ బాస్ 5వ సీజన్ తెలుగు ప్రారంభంకానుంది. సాయంత్రం 6 గంటలకు షో ప్రారంభంకానుండగా ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు. ఇక ఈసారి బిగ్ బాస్‌ హౌస్‌లో యాంకర్ రవి, సరయు సుమన్, మహా న్యూస్ లహరి, అనీ మాస్టర్, లోబో, షణ్ముఖ్ జస్వంత్, వీజే సన్నీ, ఆర్జే కాజల్ , సింగర్ కోమలి, వర్షిణి తదితరులు ఎంటర్ కానున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -