బంగార్రాజులో నలుగురు భామలు..!

120
bangarraju

కింగ్ అక్కినేని నాగార్జున‌. ద‌ర్శ‌కుడు క‌ల్యాణ్ కృష్ణ కుర‌సాల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన అద్భుత‌మైన ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ సోగ్గాడే చిన్నినాయ‌న‌.నాగ్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమా ఇది. తాజాగా సినిమాకు సీక్వెల్‌గా బంగార్రాజు తెరకెక్కుతోంది.

ఈ సినిమాలో నాగార్జున పెద్ద కొడుకు యువసామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో జరుగుతుండగా రమ్యకృష్ణ, కృతిశెట్టి హీరోయిన్లుగా ఎంపిక కాగా.. తాజాగా మరో ఇద్దరు భామలను కూడా తీసుకున్నారు. దర్శన, అక్షిత సోనావానే లను తాజాగా కీలక పాత్రలకు తీసుకున్నట్టు సమాచారం.

అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. స‌త్యానంద్ స్క్రీన్‌ప్లే స‌మ‌కూర్చారు. ఈ సినిమాకు ఛాయాగ్రాహ‌కుడిగా యువ‌రాజ్ ప‌నిచేస్తున్నారు. రొమాన్స్, ఎమోష‌న్స్, క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ అత్య‌ద్భుత‌మైన క‌ల‌యిక‌గా బంగార్రాజు హోల్‌స‌మ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ని అందించ‌డానికి సిద్ధ‌మ‌వుతోంది. ఈ ప్రాజెక్ట్ మీద హై ఎక్స్ పెక్టేష‌న్స్ ఉన్నాయి. అన్న‌పూర్ణ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టును జీ స్టూడియోస్ స‌హ నిర్మిస్తోంది.