అగ్రిహబ్ ప్రారంభం…

142
ktr
- Advertisement -

వ్యవసాయరంగంలో ఇన్నొవేషన్‌, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లను ప్రోత్సహించేందుకు అగ్రిహబ్‌ను నిర్మించింది తెలంగాణ ప్రభుత్వం. ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో నిర్మించిన అగ్రి ఇన్నొవేషన్‌ హబ్‌ను మంత్రి కేటీఆర్‌ ప్రాంరభించారు. రూ.9 కోట్ల నాబార్డ్‌ సాయంతో దీనిని నిర్మించారు. వ్యవసాయ రంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించనుంది. ఈ కార్యక్రమంలో నాబార్డ్‌ చైర్మన్‌ గోవిందరాజులు, మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, నిరంజన్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రకాశ్‌ గౌడ్‌, మంచిరెడ్డి కిషన్‌ రెడ్డి, సుధీర్‌ రెడ్డి పాల్గొన్నారు.

వ్యవసాయరంగంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు, సవాళ్లకు సాంకేతిక పరిశోధనలతో చెక్‌ పెట్టేందుకు అగ్రి హబ్‌ను రాష్ట్ర ప్రభుత్వం తెర పైకి తీసుకొచ్చింది. ‘టీ- హబ్‌’ ద్వారా ఐటీ శాఖ 87 స్టార్ట్‌ప్‌లను సూచించగా ఇందులో జయశంకర్‌ వర్సిటీ అధికారులు ప్రాధాన్యక్రమంలో 21 స్టార్ట్‌పల ఏర్పాటుకు సుముఖత వ్యక్తంచేశారు.

వరి, పత్తి, మిర్చి, మొక్కజొన్న పంటలకు డ్రోన్ల ద్వారా రసాయన ఎరువుల పిచికారీ, మొక్కజొన్నలో రోబోటిక్‌ విధానంలో కలుపు మొక్కల నివారణ, వేరుశనగ-వరిలో ముడి సరుకును ఉపయోగించి పదార్థాల తయారీ, వరిలో డ్రోన్ల ద్వారా తెగుళ్ల గుర్తింపు, వరి-పప్పు దినుసుల్లో ఎఫ్‌పీవోల ద్వారా ఫుడ్‌ ప్రాసెసింగ్‌, శనగ-వేరుశనగలో నీటిపారుదల యాజమాన్యం, భూమిలో ఎరువులపై మట్టి పరీక్షలు, యాసంగి సీజన్‌లో పరిస్థితులపై ప్రత్యేక పరీక్షలు, వరిలో కోత తర్వాత యాజమాన్య పద్ధతులు, యాసంగి సీజన్‌లో తెగుళ్లు సోకే విధానాన్ని గుర్తించటం, వరిలో మార్కెట్‌ ప్లేస్‌ ప్రయోగాలను పైలెట్‌ ప్రాజెక్టుల కింద ఎంపికచేశారు.

- Advertisement -