మహేశ్ బాబు హీరోగా దర్శకుడు మురుగదాస్ తెరకెక్కిస్తోన్న స్పైడర్ సినిమా నుంచి ఇటీవలే బూం బూం బూం పాట విడుదలైన విషయం తెలిసిందే. ఈ రోజు ఆ సినిమాలోని హాలి హాలి పాటను విడుదల చేశారు. ఈ సినిమాకి హరీశ్ జయ్ రాజ్ సంగీతం అందిస్తున్నాడు. స్పైడర్ లో మహేశ్ బాబు సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. ‘హాలి హాలి పాట విడుదలైంది… ఎంజాయ్’ అంటూ రకుల్ ప్రీత్ సింగ్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. విభిన్న కథాంశంతో మురుగదాస్ రూపొందిస్తోన్న ఈ సినిమా టీజర్ ఇటీవలే విడుదలై అందరినీ ఆకర్షించింది.
ఈ సాంగ్‌కి సంబంధించిన మహేష్, రకుల్ ప్రీత్ సింగ్ ఫోటో ఒకటి ఇటివల సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఇందులో మహేష్ స్టైలిష్ అండ్ స్మార్ట్‌గా కనిపిస్తుండగా, రకుల్ హాట్‌గా కనిపిస్తుంది. తెలుగు,తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై బాగా ఆశలు పెట్టుకుందట రకుల్ ప్రీత్ సింగ్. బైలింగ్యువల్ మూవీగా రూపొందిన ఈ చిత్రాన్ని గల్ఫ్ దేశాలలోను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మూవీలో ఎస్జే సూర్య విలన్ గా నటిస్తున్నాడు.ఈ సినిమా సెప్టెంబర్ 27 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఆడియో వేడుకను చెన్నైలో సెప్టెంబర్ 10 న నిర్వహించనున్నారు.