ఆ విషయంలో సమంతపై ఆసక్తి లేదట..

203
- Advertisement -

టాలీవుడ్‌లో చిన్న సినిమాలతో ట్రెండ్ సృష్టించిన దర్శకుడు మారుతి, భలే భలే మగాడివోయ్ సినిమాతో తో రూట్ మార్చిన మారుతి ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే చిత్రాల మీద దృష్టి పెట్టాడు. సీనియర్ హీరోగా వెంకటేష్ హీరోగా బాబు బంగారంతో పరవాలేదనిపించిన ఈ యంగ్ డైరెక్టర్, ప్రస్తుతం శర్వానంద్ హీరోగా మహానుభావుడు సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

Naga Chaitanya teams up with Maruthi

అయితే ఈ సినిమా తర్వత దర్శకుడు మారుతి నాగచైతన్యతో ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. అయితే ఈ సినిమాలో చైతూ జోడీగా సమంతా చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని మారుతి వ్యక్తం చేశాడట. పెళ్లి తరువాత చైతూ సమంతా కలిసి చేసే సినిమా కనుక, ఒక రేంజ్‌లో ఈ ప్రాజెక్టుకు క్రేజ్ వస్తుందని ఆయన భావించాడు. ఈ విషయంలో చైతూ మాత్రం ఆసక్తి చూపలేదనే టాక్ వినిపిస్తోంది.

Naga Chaitanya and Maruti combination.Chaitanya might soon be joining hands with creative director Maruti for his upcoming project..

ఇంతకుముందు చైతూ సమంతా కాంబినేషన్‌లో ‘ఏ మాయ చేశావే’ ‘మనం’ వంటి హిట్స్ వున్నాయి. అది ఒక తీపి జ్ఞాపకంగా అలా ఉండిపోవడం మంచిదనేది చైతూ భావన. పెళ్లి తరువాత చేసిన సినిమా ఫలితం తేడా కొడితే ఎన్నో కామెంట్స్ ను ఎదుర్కోవలసి వస్తుంది .. ఇదంతా అవసరమా? అంటూ చైతూ తన సన్నిహితుల దగ్గర అనాసక్తిని వ్యక్తం చేశాడట. ఈ మాటలను బట్టి ఇప్పట్లో ఈ జంట తెరపై కనిపించదనీ, ఎవరి సినిమాలు వాళ్లు చేసుకుంటారని తెలుస్తోంది. ప్రస్తుతం యుద్ధం శరణం సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాడు చైతూ. ఇక సమంతా కూడా సుకుమార్‌ డైరెక్షన్‌లో రంగస్థలం సినిమాతో బిజీగా వుంది.

- Advertisement -