పెట్టుబడుల స్వర్గధామం …. తెలంగాణ

225
KTR promotes Telangana in Mumbai
- Advertisement -

తెలంగాణ పెట్టుబడుల స్వర్గధామం అని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ముంబై పర్యటనలో భాగంగా పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ అయిన కేటీఆర్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరారు.  పర్యటనలో భాగంగా ఐసిసిఐ బ్యాంకు సిఈవో చందా కొచ్చర్ తో  సమావేశం అయ్యారు. తెలంగాణ ఇండస్ట్రీయల్ హెల్త్ క్లినిక్, ఉమెన్ ఏంట్రప్రెన్యూర్ షిప్, డిజిటల్ ఇనిషియేటివ్స్ పైన   కోచ్చార్ తో చర్చించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న టిఫండ్ లో భాగస్వాములు కావాలని కోరారు.

KTR promotes Telangana in Mumbai

జేయస్ డబ్యూ గ్రూప్ చైర్మన్ మరియు యండి సజ్జన్ జిందాల్ తో సమావేశమైన కేటీఆర్  తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. ఈ సమావేశం తర్వతా మంత్రి పైన సజ్జన్ జిందాల్ ప్రసంశల వర్షం కురిపించారు. తెలంగాణ అభివృద్ది పట్ల మంత్రికి ఉన్న విజన్ కు అభినందనలు తెలిపారు. తెలంగాణ అభివృద్ది పట్ల మంత్రి కెటి రామారావుకు ఉన్న నిబద్దత, అలోచనలు ఇతర రాజకీయ నాయకులకు కూడా ఉంటే దేశం మరింత ఉన్నత శిఖరాలకు చేరుతుందని ట్వీట్ చేశారు. లూపిన్ యండి నీలేష్ గుప్తతో సమావేశం అయిన మంత్రి తెలంగాణ ఫార్మసిటీలో పెట్టుబడులు పెట్టాలని కోరారు.

సాయంత్రం జరిగిన వార్షిక గ్లోబల్ పెట్టుబడిదారుల సమావేశంలో “ స్టార్ట్ అప్ స్టేట్ గా మూడేళ్ల తెలంగాణ ప్రయాణం” అనే అంశంపైన మంత్రి ప్రసంగించారు. తాము ఒక  స్టార్ట్ అప్ కంపెనీలాగా ఉన్నతమైన నిబద్దత, పట్టుదలతో రాష్ట్రంలో పెట్టుబడుల కోసం ప్రయత్నాలు చేస్తున్నామని, తాము రూపోందించిన పారిశ్రామిక పాలసీ, ఇతర పాలసీలకు ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రసంశలు లభిస్తున్నాయన్నారు. ఒక వైపు సంక్షేమం, మరోపైపు అభివృద్ది, పెట్టుబడుల సేకరణ వంటి బహుముఖ లక్ష్యాలతో ముందుకు పొతున్నామని తెలిపారు.

KTR promotes Telangana in Mumbai

ముంబైలో ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ తో సమావేశం అయ్యారు కేటీఆర్. తెలంగాణ రాష్ట్రంలోని సూక్ష్మ మరియు చిన్న తరహా పరిశ్రమలు సమస్యలపైన వాటి బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపైనా సవివరమైన లేఖను అందజేయడం జరిగింది. దాదాపు గంట సేపు జరిగిన ఈ సమావేశంలో చిన్నతరహా పరిశ్రమల అభివృద్ధి కోసం ఆర్బీఐ నుంచి కావాల్సిన మద్దతు పైన మంత్రి వివరించారు. భారత దేశ ఆర్థిక వ్యవస్థలో చిన్నతరహా పరిశ్రమల పారిశ్రామికోత్పత్తి 45 శాతం ఉందని, మొత్తం 40 శాతం ఎగుమతులు చిన్నతరహా పరిశ్రమల నుంచే వస్తున్నాయని మంత్రి తెలిపారు. చిన్నతరహా పరిశ్రమలతో లక్షలాది మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయని ఇలాంటి రంగానికి కేంద్ర బ్యాంకు సహకారం అవసరమని తెలిపారు.

KTR promotes Telangana in Mumbai

- Advertisement -