ప్రియంకా రెడ్డి కేసు విచార‌ణ‌కు ప్రత్యేక కోర్టు

385
Indrakaran Reddy
- Advertisement -

షాద్ నగర్ కు చెందిన వెటర్నరీ డాక్టర్ ప్రియాంక దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసును ప్రభుత్వం చాలా సీరియన్ గా తీసుకుంది. నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి కేసీఆర్.

ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి తెలిపారు. ప్రత్యేక కోర్టు ఏర్పాటుపై హైకోర్టుకు ప్ర‌తిపాద‌న‌లు పంప‌నున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రత్యేక కోర్టు ఏర్పాటైన వెంట‌నే రోజు వారీ పద్దతిలో విచార‌ణ జ‌రిపి, నిందితుల‌కు త్వరిత‌గ‌తిన శిక్ష ప‌డేలా చ‌ర్యలు తీసుకుంటామ‌ని మంత్రి పేర్కొన్నారు.

- Advertisement -