లారీలో కూర్చొని బోర్ కొట్టిందిః దిశా హత్యాచార నిందితులు

420
Priyanka Reddy Killers New

దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించిన దిశా హత్యాచార కేసులో సంచలన నిజాలు బయటకు వస్తున్నాయి. నిందితులను 14రోజుల రిమాండ్ విధించి చెర్లపల్లి జైలుకు తరలించారు. రిమాండ్ లో భాగంగా నిందితులను విచారిస్తున్నారు అధికారులు. అయితే ఆసమయంలో తాము ఫుల్ గా తాగి ఉన్నామని ఏం చేస్తున్నామో తమకు అర్ధం కావడం లేదని చెప్పారు. మద్యం ఎక్కువ అవడంతోనే ఈపని చేసినట్లు వెల్లడించారు.

ఉదయం నుంచి లారీలో కూర్చోని కూర్చొని విసిగిపోయామని…సాయంత్రం మద్యం తాగుతున్న సమయంలో దిశా వచ్చి స్కూటీని పార్క్ చేయడం చూసినట్లు తెలిపారు. దిశ మళ్లి ఇక్కడికి వస్తుందని తెలుసుకుని ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నామని నిందితులు పేర్కొన్నారు.

ఆమె ఎంత ఆలస్యంగా వస్తే తమ పని అంత సులభమవుతుందని భావించామని నిందితులు తెలిపారు. అత్యాచారం అనంతరం పారిపోవాలని అంతకుముందే నిర్ణయించుకున్నట్టు చెప్పారు. అయితే, ఆమెను చంపేసి కాల్చేస్తే ఎవరికీ తెలియదని అనుకున్నామని, కానీ ఇంత దూరం వస్తుందని అనుకోలేదని పోలీసుల దర్యాప్తులో వెల్లడించారు నిందితులు.