దేశంలో ప్రశ్నిస్తే దేశద్రోహమే. ఏడు దశాబ్దాల స్వతంత్ర్య భారతంతో ఎప్పుడు చూడని పరిస్థితి. ఇక పొరపాటున మోదీ సార్‌ని ఏమన్నా అన్నారో ఇక అంతే. సోషల్ మీడియాలో కాషాయ మూకలు(ఫేక్ అకౌంట్లతో) చేసే రచ్చ అంతా ఇంత కాదు. దేశద్రోహులు,హిందు వ్యతిరేకులు,కలిస్తాన్ ఉగ్రవాదులు, పాకిస్థాన్ ఏజెంట్లు ఇలా ఏది పడితే అది ఇష్టం వచ్చినట్లు ట్రోల్ చేయడం వాట్సాప్ యూనివర్సిటీ పార్టీకి, ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి తిట్లు తిట్టడం పరిపాటిగా మారిపోయింది.
అయితే తాజాగా జరుగుతున్న బెంగాల్ ఎన్నికల్లో ఓ బీజేపీ నేత బహిరంగంగానే మోదీని విమర్శిస్తే ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకించినట్లేనని స్టేట్ మెంట్ ఇచ్చి తన పైత్యాన్ని చాటుకున్నాడు. మోదీకి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే ప్రజాస్వామ్యం, భారతమాతకు వ్యతిరేకంగా మాట్లాడినట్టేనని నందిగ్రామ్ బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి వ్యాఖ్యానించారు.
రెండు రోజుల క్రితం మమతా బెనర్జీ.. ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించారు. కరోనా వ్యాక్సినేషన్ సహా అనేక అంశాల్లో మోదీ తీరును ఆమె ఎడగట్టారు. ఈ నేపథ్యంలోనే ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. ప్రశ్నించే వారు దేశద్రోహులైతే బీజేపీ అధికారంలో లేని చోట అక్కడి ప్రభుత్వాలను విమర్శిస్తున్న వారు(బీజేపీ నేతలు) ఏమవుతారో చెప్పాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.