పొత్తు కుదిరింది..నీకు 105, నాకు 298

185
Congress
- Advertisement -

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పొత్తు విషయంలో కాంగ్రెస్ పార్టీ, సమాజ్వాదీ పార్టీల మధ్య సయోధ్య కుదిరింది. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ జోక్యంతో ఇరు పార్టీల మధ్య పొత్తు వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది. పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీకి 105 అసెంబ్లీ స్థానాలు కేటాయించేందుకు ఎస్పీ అంగీకరించింది. దీంతో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ, కాంగ్రెస్ కలిసి పోటీ చేయనున్నాయి. అయితే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇరు పార్టీల మధ్య అత్యున్నత స్థాయిలో చర్చలు జరిగినట్టు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అహ్మద్‌ పటేల్‌ చెప్పారు.

Congress

మొదట తమకు 110 స్థానాలు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ పట్టుబట్టగా, 100 స్థానాలు మాత్రమే ఇస్తామని యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌ చెప్పడంతో ఇరు పార్టీల మధ్య పొత్తు వ్యవహారం కుదరని అనుకున్నారు. కానీ చివరకు కాంగ్రెస్ అగ్రనాయకత్వం జోక్యంతో 105 సీట్లు ఇచ్చేందుకు అఖిలేష్ అంగీకరించారు. శనివారం కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌.. అఖిలేష్తో చర్చలు జరిపారు.

పొత్తు విషయంలో గత రెండు మూడు రోజులుగా జరిగిన చ‌ర్చ‌లు విఫ‌లం కావ‌డంతో రెండు పార్టీల మ‌ధ్య పొత్తు ఉండ‌దనే అంతా అనుకున్నారు. ఎవ‌రికి వారే ఒంటరిగా బ‌రిలోకి దిగుతామ‌న్న సంకేతాలు సైతం ఇచ్చారు. అయితే కాంగ్రెస్ త‌ర‌పున ఉత్త‌ర్‌ప్ర‌దేశ్ ఇంఛార్జ్‌గా ఉన్న కేంద్ర‌ మాజీ మంత్రి గులామ్ న‌బీ ఆజాద్ మాత్రం పొత్తుపై ఇంకా ఆశ‌లు నీరుగార‌లేద‌ని నిన్న ప్ర‌క‌టించారు. నిన్న‌టి వ‌ర‌కు కాంగ్రెస్‌కు 100 సీట్ల‌కు మించి ఇచ్చేది లేద‌ని భీష్మించుకు కూర్చున్న స‌మాజ్‌వాదీ అధినేత యూపీ ముఖ్య‌మంత్రి అఖిలేష్ యాద‌వ్ ఈ రోజు కాస్త చ‌ల్ల‌బ‌డ్డాడు. కాంగ్రెస్‌కు 105 సీట్లు ఇచ్చేందుకు సుముఖ‌త వ్య‌క్తం చేశారు. దీంతో ఉత్త‌ర్ ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో స‌మాజ్ వాదీ పార్టీ- కాంగ్రెస్ పార్టీలు క‌లిసి పోటీ చేయ‌నున్నాయి. స‌మాజ్‌వాదీ పార్టీ మొత్తం 298 సీట్ల‌లో పోటీ చేయ‌నుంది.

- Advertisement -