నమ్రతపై మహేష్‌కు ఎంత ప్రేమో….

80

సినీ ప్రముఖుల వ్యక్తిగత జీవితాల విషయంలో రకరకాల వార్తలు షికార్లు చేస్తుంటాయి. ఇటీవల కాలంలో చాలా మంది సినీ ప్రముఖులు విడాకులు తీసుకోవడంతో ఆవార్తలకు మరింత బలం చేకురింది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఆదర్శ దంపతులుగా గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్‌ స్టార్‌ కపుల్స్‌ మహేష్‌,నమ్రత. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈజంట ఎంతో మంది సెలబ్రిటీలకు ఆదర్శంగా నిలిచింది.

Namrata strength and light of my life

ఇప్పటికే వీరిద్దరు ఒకరి మీద ఒకరు తమకున్న ప్రేమను రకరకాలుగా తెలియజేశారు. తాజాగా నమ్రత పుట్టినరోజు సందర్భంగా ఆమెపై ఉన్న ప్రేమాభిమానాన్ని మహేష్‌ మరోసారి బయటపెట్టాడు. నమ్రతకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ‘నా బలం, నా జీవితానికి వెలుగు-నా ప్రియమైన సతీమణికి పుట్టినరోజు శుభాకాంక్షలు’అని ట్వీట్‌ చేస్తూ.. నమత్ర ఫొటోను పోస్ట్‌ చేశారు.

Namrata strength and light of my life

ప్రస్తుతం మహేశ్‌ ఎ.ఆర్‌. మురుగదాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రంలో నటిస్తున్నారు. రకుల్‌ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ఎస్‌.జె. సూర్య ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ‘సంభవామి’ అనే టైటిల్‌ను ఫిక్స్‌చేసినట్లు సమాచారం.