ప్రతీ ఏడాదిలాగే ఈ ఏడాది రాజకీయ పార్టీలకు వచ్చే విరాళాల వివరాలను వెల్లడించింది అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్). విరాళాల పరంగా దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది భారతీయ జనతా పార్టీ (బీజేపీ). గతేడాదితో పోలిస్తే దాదాపు వెయ్యి కోట్లు అధికంగా అంటే బీజేపీకి రూ.2,243 కోట్లు విరాళంగా అందాయి. దీంతో విరాళాల్లో టాప్ ప్లేస్‌లో నిలిచింది బీజేపీ.
ఇక రెండో స్థానంలో కాంగ్రెస్ నిలిచింది. కాంగ్రెస్ పార్టీకి రూ.281 కోట్ల విరాళాలు లభించాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో కాంగ్రెస్‌కు రూ.79.924 కోట్లు మాత్రమే రాగా 2023-24లో అది రూ.281.48 కోట్లకు చేరుకుంది.
ఆమ్ ఆద్మీ పార్టీ, సీపీఎం, నేషనల్ పీపుల్స్ పార్టీలు తక్కువ మొత్తంలోనే విరాళాలను పొందినట్లు నివేదిక తెలిపింది. బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) మాత్రం గతంలాగే ఈసారి కూడా తమకు ఎలాంటి విరాళాలు అందలేదని స్పష్టం చేసింది. మొత్తం 12,547 మంది దాతల నుంచి రూ.2,544.28 కోట్లు విరాళంగా వచ్చాయి.
Also Read:BRS రజతోత్సవం..3వేల బస్సులు ఇవ్వండి

