తడిసిముద్దైన భాగ్యనగరం…

305
rains
- Advertisement -

భాగ్యనగరం తడిసిముద్దైంది. పలు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్సాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. లోతట్లు ప్రాంతాలు జలమయమయ్యాయి. బంజారా హిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. సనత్ నగర్ పరిధిలోని ఎర్రగడ్డ, మోతీనగర్, మైత్రీవనంలో వర్షం పడింది. రాయదుర్గం, గచ్చిబౌలి, మాదాపూర్, ఎస్‌ఆర్‌నగర్, అబిడ్స్, నాంపల్లి, సుల్తాన్ బజార్, బేగం బజార్, ఎల్బీనగర్‌లో మోస్తారు వర్షం పడింది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని మేయర్‌ బొంతు రామ్మోహన్‌ ఆదేశించారు.

hyderabad rains

భారీ వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కార్యాలయాల నుంచి ఇళ్లకు బయలు దేరిన వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. గచ్చిబౌలి, రాజేంద్రనగర్‌, హైటెక్‌ సిటీ, బంజారాహిల్స్‌లలో ఈదురు గాలుతో కూడిన వర్షం కురుస్తోంది.

పశ్చిమ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. ఈ నెల 13న అల్పపీడనం ఏర్పడే అవకాశముందని అధికారులు తెలిపారు.

- Advertisement -