ఆమ్రపాలిపై సుప్రీం కన్నెర్ర…

239
amrapaali
- Advertisement -

ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ ఆమ్రపాలి సంస్థపై సుప్రీం కన్నెర్ర చేసింది. గడువులోగా ప్రజలకు ప్లాట్లు ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్ధానం అతి తెలివి చూపించవద్దని వార్నింగ్ ఇచ్చింది. 15 రోజుల్లోగా ఆస్తుల వివరాలు సమర్పించాలని లేకుంటే డైరెక్టర్ల ఆస్తులు వేలం వేసైనా ప్రాజెక్టు చేపడతామని హెచ్చరించింది.

ఇన్వెస్టర్ల నుంచి ఆమ్రపాలి గ్రూపు కంపెనీలు రూ.2,765 కోట్లను వసూలు చేసి వాటిని దారి మళ్లించినట్టు వచ్చిన ఆరోపణలు వెలువడ్డాయి. 42,000 మందికి ఫ్లాట్లు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతుండటంతో బాధితులు న్యాయస్ధానాన్ని ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్ధానం ఆమ్రపాలి సంస్థ విశ్వాస ఘాతుకానికి పాల్పడినట్టు ప్రాథమిక ఆధారాలున్నాయని అభిప్రాయపడింది.

ఈ గ్రూపు తాలూకు బ్యాంకు ఖాతాల వివరాలను 2008వ సంవత్సరం నుంచి ఇప్పటివరకు కోర్టు ముందుంచాలని గతంలో ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే.

- Advertisement -