తొలి టీ20లో దక్షిణాఫ్రికా ఘన విజయం..

52
sa
- Advertisement -

భారత్‌తో జరిగిన తొలి టీ20లో దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది. భారత్ విధించి 212 పరుగుల లక్ష్యాన్ని మరో 5 బంతులు మిగిలి ఉండగానే కేవలం 3 వికెట్లు మాత్రమే కొల్పోయి గెలుపొందింది దక్షిణాఫ్రికా. న్‌డెర్‌ డసెన్‌ (46 బంతుల్లో 75 నాటౌట్‌; 7 ఫోర్లు, 5 సిక్సర్లు), ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ డేవిడ్‌ మిల్లర్‌ (31 బంతుల్లో 64 నాటౌట్‌; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) నాలుగో వికెట్‌కు 64 బంతుల్లోనే 131 పరుగులు జోడించి సిరీస్‌లో సఫారీకి శుభారంభం అందించారు. 200కుపైగా పరుగులు చేశాక భారత్‌ ఓడటం ఇదే తొలిసారి.

ఇక అంతకముందు టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా భారత్‌కు బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. భారత్‌ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 211 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ (48 బంతుల్లో 76; 11 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగగా… హార్దిక్‌ పాండ్యా (12 బంతుల్లో 31 నాటౌట్‌; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ (16 బంతుల్లో 29; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు.

- Advertisement -