సఫారీలతో ఢీ.. టీమిండియాకు సవాలే!

48
- Advertisement -

వరల్డ్ కప్ లో రసవత్తరమైన పోరుకు నేడు తెరలేవనుంది. పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో ఉన్న టీమిండియా, సౌతాఫ్రికా జట్లు నేడు తలపడనున్నాయి. ఈడెన్ గార్డెన్ లో జరగనున్న ఈ మ్యాచ్ మద్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానుంది. వరుస విజయాలతో టీమిండియా దూసుకుపోతుంటే.. మరోవైపు సఫారీ జట్టు కూడా అదే స్థాయిలో దూసుకుపోతుంది. నెదర్లాండ్ తో జరిగిన మ్యాచ్ మినహా మిగిలిన అన్నీ మ్యాచ్ లలో కూడా సౌతాఫ్రికా సంచలన విజయాలను నమోదు చేస్తూ వస్తోంది. ఇప్పటికే రెండు జట్లు కూడా సెమీస్ బెర్త్ లను కన్ఫర్మ్ చేసుకున్నాయి. దాంతో సెమీస్ కు ముందు ఈ మ్యాచ్ గెలిచి మరింత ఆత్మవిశ్వాసం కూడగట్టుకోవాలని ఇరు జట్లు ప్రయత్నిస్తున్నాయి.

ప్రస్తుతం టీమిండియా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్నీ విభాగాల్లోనూ ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తోంది. అటు సౌతాఫ్రికా కూడా అంతే పటిష్టంగా ఉంది. రెండు జట్ల మద్య భీకర పోరు నడిచే అవకాశం ఉంది. కాగా గెలిచిన జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి వెళ్ళే అవకాశం ఉంది. ప్రస్తుతం టీమిండియాలో రోహిత్ శర్మ, గిల్, శ్రేయస్ అయ్యర్,విరాట్ కోహ్లీ.. ఇలా అందరూ కూడా ఫుల్ ఫామ్ లో ఉన్నారు. బౌలింగ్ విషయానికొస్తే మహ్మద్ షమి నిప్పులు చెరిగే బౌలింగ్ తో ప్రత్యర్థి బ్యాట్స్ మెన్స్ ను కుప్ప కూల్చుతున్నాడు.

అలాగే మహ్మద్ సిరాజ్, బుమ్రా కూడా అద్బుతంగా రాణిస్తున్నారు. సౌతాఫ్రికా జట్టులో క్వింటన్ డికాక్, హెన్రీచ్ క్లాసెన్, బావుమా, జాన్సేన్.. వంటి బ్యాట్స్ మెన్స్ భీకర ఫామ్ లో ఉన్నారు. వీరిని వీలైనంత త్వరగా పెవిలియన్ పంపడం చాలా మంచిది. బౌలింగ్ లో ఎంగిడి, రబడ, విలియమ్స్.. వంటి వాళ్ళతో భారత బ్యాట్స్ మెన్ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మొత్తానికి ఈడెన్ గార్డెన్ లో రెండు భీకర జట్ల మద్య జరిగే సమరంలో విజయం ఏ జట్టును వరిస్తుందో చూడాలి.

Also Read:పచ్చి ఉల్లి తింటే ప్రమాదమా?

- Advertisement -