వాట్సాప్‌లో రానున్న మరో సరికొత్త ఫిచర్‌..!

231
- Advertisement -

స్మార్ట్‌ఫోన్‌ యుగంలో ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో ఆకట్టుకుంటున్న వాట్సాప్‌ మెసెంజర్… గత కొద్ది రోజుల కిందటే కొత్త ఫీచర్‌ను యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ‘వాట్సాప్ పేమెంట్స్’ ద్వారా ఈ సదుపాయాన్ని కల్పించింది. మొబైల్ ఫోన్‌లో వాట్సాప్‌ ఉంటే చాలు ఈ ఫిచర్‌తో చెల్లింపులు చేయవచ్చు. యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌(యూపీఐ) ద్వారా వాట్సాప్‌లో నగదు లావాదేవీలు నిర్వహించుకోవడానికి ఈ ఫిచర్‌ ఉపయోగపడుతుంది.

Soon, pay your bills with WhatsApp

కాగా ఇదే తరహాలో మరో అదిరిపోయే ఫీచర్‌ను వాట్సాప్ యూజర్లకు అందుబాటులోకి తేనుంది. యూజర్లు ఆన్‌లైన్‌లో ఏదైనా సైట్‌లో కొనుగోలు చేసే వస్తువులకు లేదా బిల్లు చెల్లింపుల సమయంలో, మొబైల్ రీచార్జికి వాట్సాప్‌ను పేమెంట్ ఆప్షన్‌గా ఎంచుకోవచ్చు. దీంతో వాట్సాప్ ద్వారా ఆయా బిల్లుల చెల్లింపులు జరుగుతాయి. పూర్తిగా సురక్షితమైన విధానంలో ఈ పేమెంట్స్ జరుగుతాయి. ప్రస్తుతం వాట్సాప్ ఈ ఫీచర్‌ను అంతర్గతంగా పరిశీలిస్తున్నది. త్వరలోనే యూజర్లకు అందుబాటులోకి వస్తుంది.

- Advertisement -