పేటీఎం బంపర్ ఆఫర్

217
Paytm launches e-wallet insurance

ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ సంస్థ పేటీఎం మరో ముందడుగు వేసింది. నోట్ల రద్దు తర్వాత మనీ ట్రాన్స్ ఫర్,లావాదేవీలతో పేటీఎం రేంజ్ పెరిగిపోయింది. గల్లీలో చిన్న కొట్టు దగ్గరి నుంచి బకా మాల్స్ వరకు పేటీఎం బోర్డులు వెలిశాయి. ఛాయ్ వాలా నుంచి సినిమా హాల్ వరకు పేటీఎం కస్టమర్లు పెరిగిపోయారు. పెరిగిన కస్టమర్లకు మరింత ధీమా అందించేందుకు వివిధ రకాల  ఆఫర్లను ప్రవేశ పెట్టిన పేటీఎం తాజాగా మరో బంపర్ ఆఫర్‌ ప్రకటించింది.

మీ మొబైల్ ఫోన్ లో పేటీఎం యాప్ ఉంటే చాలు మీకు ఆటోమేటిక్ గా బీమా సదుపాయం కల్పిస్తోంది. ఈ సౌకర్యం ఇవాల్టీ నుంచే అందుబాటులోకి వస్తుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఈ యాప్ ఉన్న వాలెట్ పోయినా లేదా వాలెట్ నుంచి డబ్బు మీ అనుమతి లేకుండా మాయం అయినా అందుకు పేటీఎం ఇన్సూరెన్స్ ఇస్తోందని కంపెనీ ప్రకటించింది. కస్టమర్లు అందరికీ ఇది వర్తిస్తుందని.. బీమా కోసం ఒక్కపైసా చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అయితే ఈ ఇన్సూరెన్స్ ఏడాదికి ఒకసారి మాత్రమే క్లయిమ్ చేసుకునే అవకాశం ఉంది.

పేటీఎంలోని డబ్బు మీ అనుమతి లేకుండా ట్రాన్సఫర్ అయితే వెంటనే పేటీఎం కస్టమర్ కేర్ కు కాల్ చేయాలి. నంబర్ 91-9643979797కు 24గంటల్లో కంప్లయింట్ ఇవ్వాలి. వెంటనే మీ అకౌంట్ ను బ్లాక్ చేస్తారు. అన్ని పరిశీలించిన తర్వాత ఐదు రోజుల్లో మీకు కొత్త పిన్ నంబర్ తోపాటు మీ డబ్బును మీ అకౌంట్ లోకి ట్రాన్సఫర్ అవుతుంది. ఇది కేవలం రూ.20వేల వరకు మాత్రమే ఇన్సూరెన్స్ సదుపాయం ఉంది. ఇక మొబైల్ పోయినా.. దొంగతనం జరిగినా పోలీస్ స్టేషన్ లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాల్సి ఉంటుంది. దాని ప్రకారం కొత్త ఫోన్ ఇస్తారు.