నీటి కరువుకి రూ. 5.5లక్షల విరాళం..!

174
- Advertisement -

భారత కెప్టెన్ దాతృత్వం మళ్లీ బయటపడింది. దీనికి సఫారీ జట్టు సైతం చేయందించింది. సఫారీ పర్యటనకు వెళ్లిన భారత్ అక్కడి నీటి ఎద్దడికి తీవ్ర ఇబ్బందుల పాలైన విషయం తెలిసిందే. పరిస్థితిని అర్థం చేసుకున్న ఇండియా, సౌతాఫ్రికా టీమ్స్ తాజాగా కేప్‌టౌన్‌కు తమ వంతు సాయంగా 8500 డాలర్లు (సుమారు రూ.5.5 లక్షలు) విరాళమిచ్చాయి.

మూడో టీ20 మ్యాచ్ ముగిసిన తర్వాత కోహ్లి, డుప్లెస్సి ఇద్దరూ కలిసి గిఫ్ట్ ఆఫ్ ద గివర్స్ ఫౌండేషన్‌కు ఈ సాయం అందజేశారు. ఆఫ్రికా ఖండంలో విపత్తులు సంభవించినపుడు ఆదుకునే సంస్థల్లో ఇదే అతి పెద్దది. కేప్‌టౌన్‌లో ఉన్న కరువు పరిస్థితులను పారదోలడానికి చేపట్టిన కార్యక్రమాల కోసం ఈ మొత్తాన్ని వాడనున్నట్లు ఈ ఫౌండేషన్ చైర్మన్ ఇంతియాజ్ సూలిమాన్ చెప్పారు.

 Indian and South African cricketers donate Rs 5.5 lakh to

ముఖ్యంగా శారీరక, మానసిక జబ్బులతో బాధపడుతున్న వారి ఇళ్లకు నీళ్లు సరఫరా చేయడానికి వీటిని వినియోగించనున్నట్లు ఆయన తెలిపారు. కేప్‌టౌన్‌లో ఉన్న భూగర్భ జలాలన్నీ అడుగంటాయి. జలాశయాలు ఎడారులను తలపిస్తున్నాయి. దీంతో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి నీటిని సరఫరా చేయాల్సిన పరిస్థితి నెలకొంది. వచ్చే రెండు నెలల్లో డే జీరో అంటే.. పూర్తిగా నీళ్లు లభించని స్థితికి చేరే ప్రమాదం కనిపిస్తున్నది.

- Advertisement -