- Advertisement -
నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం బింబిసార. నందమూరి తారకరామారావు ఆర్ట్స్ బ్యానర్‌పై కల్యాణ్ రామ్ నిర్మిస్తుండగా కేథరిన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో కల్యాణ్ బింబిసారుడు అనే రాజు పాత్రలో నటించగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది.
సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా ఆసక్తికర విషయాలను వెల్లడించారు కల్యాణ్….అన్ని కుదరితే త్వరలోనే ఎన్టీఆర్‌తో మల్టీస్టారర్ ఉంటుందని చెప్పారు. బింబిసార సినిమా మూడు పార్టులు ఉంటుందని, వచ్చే సంవత్సరం బింబిసార 2 వస్తుందని ముందే చెప్పేయగా బింబిసార 2 లేదా బింబిసార 3 లో కచ్చితంగా కళ్యాణ్ రామ్ తో ఎన్టీఆర్ కలిసి నటించబోతున్నట్టు తెలుస్తుంది.
ఈ వార్త ఎన్టీఆర్ అభిమానులతో పాటు, నందమూరి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
- Advertisement -