బాలయ్యకు విలన్‌గా సోనూ సూద్‌..

133
Sonu Sood

”సింహ, లెజెండ్” లాంటి భారీ సక్సెస్‌ల తర్వాత బాలకృష్ణ- బోయపాటి శ్రీను కాంబోలో హాట్రిక్ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ మూవీ కొంతమేర షూటింగ్ జరుపుకొని లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది. ఇందులో బాలయ్య రెండు డిఫరెంట్ షేడ్స్‌లో కనిపించనున్నాడు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మళ్లీ సెట్స్‌పైకి వెళ్లనుంది. అభిమానులు బిబి3 ( BB3 ) అనే టైటిల్‌తో పిల్చుకుంటున్న ఈ సినిమాకు ఇంకా అధికారికంగా టైటిల్ ప్రకటించలేదు.

తాజాగా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో విలన్ పాత్ర పోషించే అవకాశం ఇప్పుడు సోనూ సూద్ కు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ చిత్రం తదుపరి షూటింగ్ త్వరలో హైదరాబాదులో మొదలవుతుంది. మరోపక్క, బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రూపొందుతున్న ‘అల్లుడు అదుర్స్’ చిత్రంలో కూడా సోనూసూద్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం కోసం ఆయన హైదరాబాదు రామోజీ ఫిలిం సిటీలో వున్నాడు.