కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై చర్చించాం: ఆజాద్

113
azad
- Advertisement -

కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో భేటీ అయ్యారు ఆ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్. ఢిల్లీలోని 10 జన్‌పథ్‌లోని సోనియా నివాసంలో జరిగిన ఈ భేటీలో పలు కీలక అంశాలను చర్చించారు. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆజాద్…వచ్చే ఎన్నికలకు ఎలా సన్నద్ధం కావాలి, పార్టీని ఎలా బలోపేతం చేసుకోవాలి, ప్రతిపక్షాలను ఎలా ఎదుర్కోవాలి అనే అంశాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు ఆయన పేర్కొన్నారు.

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర వైఫల్యం అనంతరం పార్టీ అధినేత్రి సోనియా గాంధీ పరిస్థితులను చక్కబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా పార్టీలో అటు జాతీయస్థాయిలోనూ ఇటు ప్రాంతీయ స్థాయిలోను సంస్థాగత మార్పులు చేస్తున్నారు. ఈక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ శుక్రవారం సాయంత్రం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిశారు.

- Advertisement -