- Advertisement -
ప్రపంచానికి రెండు కోవిడ్ వ్యాక్సిన్ లు అందించిన భారత్ ప్రపంచానికి ఆరోగ్య దర్శినిగా నిలెబెట్టిన మహనీయుడు మనభారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీ అని బిజెపి ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు అన్నారు. ఆయన ఈరోజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ..కోవిడ్-19 వ్యాక్సిన్ విషయంలో ప్రపంచ అగ్రరాజ్యాలలో భారతదేశం అగ్రగామిగా ఉంది అన్నారు. ఇప్పటివరకు, 156 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోస్‌లను ఇచ్చాము. 18 ఏళ్లకు పై జనాభాలో 70% మందికి రెండు డోసుల వ్యాక్సిన్ లు అందించడ జరిగింది. బూస్టర్ డోస్‌ల ప్రక్రియ కూడా ప్రారంభమైందని తెలిపారు. ఒమిక్రాన్ వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలి.. వ్యాక్సిన్ అందించి సంవత్సర కాలమైన సందర్భంగా ప్రధానికి ఆంధ్రప్రదేశ్ ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు.
- Advertisement -