సోషల్ మీడియాలో బండి సంజయ్ పై జోకులు!

62
ts bjp

గోబెల్స్ ప్రచారంలో బీజేపీకి సరిరారు..సరిలేరు ఎవ్వరూ. తప్పును ఒప్పుగా ప్రచారం చేయడం,పెయిడ్ క్యాంపెయినింగ్‌తో సోషల్ మీడియాలో కాషాయ భక్తులు చేసే హంగామా అంతా ఇంతకాదు. ఇదే స్ట్రాటజీని జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అమలుచేస్తూ ప్రజలు,నెటిజన్ల చేత చివాట్లు తింటున్నారు కమలం నేతలు. రాష్ట్రానికి పైసా సాయం చేయకుండానే మేమే చేశాం అంటూ పదేపదే చెబుతూ సోషల్ మీడియాలో సొల్లు కబుర్లతో కాలం వెల్లదిస్తున్నారు.

దీనికి తోడు గ్రేటర్ ఎన్నికల సందర్భంగా బీజేపీ నేతలు ఇచ్చిన హామీలు నవ్వు తెప్పిస్తున్నాయి. బండిపోతే బండి,కారు పోతే కారు, ఛలాన్లు మేమే కడతాం, ఇంటికి రూ. 25 వేలు ఇస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉన్నాయి. బండి సంజయ్ చేసిన ఈ వ్యాఖ్యలతో కమలం నేతలు లోపల ఇబ్బందులు పడుతున్నా పైకి మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో బండిపోతే బండి,కారు పోతే కారు ఎలా ఇస్తారని ప్రశ్నించగా ఇన్సూరెన్స్ ద్వారా ఇస్తామని తెలిపాడు. దీంతో ఇన్సురెన్స్ ఉంటే నువ్వేంది బండికి బండి ఇప్పించేది అంటూ ఫన్నీ ఎమోజీ షేర్ చేస్తూ బండి సంజయ్‌ని తూర్పార బడుతున్నారు నెటిజన్లు. బండిపోతే బండి ఇద్దమనుకుందాం మరీ ఫర్నిచర్ ఎలా ఇస్తారని ప్రశ్నలు కురిపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా సాయం చేస్తుంది అంటే నమ్మవచ్చు కానీ మీరు ఎలా సాయం చేస్తారు అని రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు నీళ్లు నమిలాడు కమల దళపతి. ఏదిఏమైనా బీజేపీ నేతల నేలబారు హామీలతో ప్రజలు మాత్రం తెగ ఎంజాయ్ చేస్తున్నారు.