హైదరాబాద్‌లో శాంతి ఉంటేనే ఇండస్ట్రీ బాగుంటుంది- కేటీఆర్‌

141
ktr
- Advertisement -

శుక్రవారం జె.ఆర్.సిలో రియల్ ఎస్టేట్ సమ్మిట్ 2020 సమావేశానికి మంత్రి కేటీఆర్ హాజరైయారు. ఈ కార్యక్రమంలో ట్రెడా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..గడిచిన అరేళ్లలో మేము పారదర్శక పాలన అందించాము. జవాబుదారీతనం కోసం కొత్త చట్టాలు తీసువచ్చాము. ల్యాండ్ రిజిస్ట్రేషన్, మ్యుటేశన్ కోసం కొత్త పద్దతి కోసం ప్రయత్నాలు చేస్తున్నాం. ఒక వేళ కానీ పక్షంలో కొన్ని రోజులు పాత పద్దతిలో నాన్ అగ్రకల్చర్ ల్యాండ్ల రిజిస్ట్రేషన్ కోసం సీఎంతో మాట్లాడి ఒప్పిస్తామని కేటీఆర్‌ హామీ ఇచ్చారు.

తెలంగాణలో ప్రతి ఇంచు భూమిని డిజిటల్ సర్వే చేయబోతున్నాము. మాకు ఎవరినో ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశ్యం కాదు. గడిచిన 5 ఏళ్లలో హైదరాబాద్ లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాము. నగరంలో మంచి నీటి సరఫరాను మెరుగుపరుచుకున్నాం. 5 లక్షలు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశాం. దేశంలో ఉన్న సీసీటీవీ కెమెరాలలో 60 శాతం తెలంగాణలో ఉన్నాయి. ఏ సంస్థ నివేదిక ఇచ్చిన హైదరాబాద్ నగర పురోగతిని స్పష్టం చేస్తున్నాయని మంత్రి అన్నారు.

కేంద్రం రాజ్యాంగ బద్ధంగా ఇవ్వాల్సిన మొత్తం మాత్రమే తెలంగాణకి ఇచ్చింది. కేంద్రం ఇప్పటివరకు రాష్ట్రానికి ఇంచ్చిందేమీ లేదు. ఒకాయన సమాధులు విషయం…మరొకాయన సర్జ్కికల్ దాడి అంటున్నరు. లా అండ్ ఆర్డర్ విషయంలో కఠినంగా ఉంటాం.నగరంలో శాంతి ఉంటేనే ఇండస్ట్రీ బాగుంటుంది. పెద్ద పెద్ద కంపెనీలు హైదరాబాద్ కు వస్తున్నాయి అని సంతోష పడుతున్నాము. కర్ఫ్యూ ఉంటే హైదరాబాద్ కి పెద్ద కంపెనీలు వస్తాయా ? కొందరు పేర్లు మారుస్తామని అంటున్నారు.. భాగ్య నగరం అని పేరు మారిస్తే బంగారం అవుతుందా..అని మంత్రి ఎద్దేవ చేశారు.

హైదరాబాద్ కి నేమ్ చెంజర్స్ కావాలా …గేమ్ చెంజర్స్ కావాలా నిర్ణయం తీసుకోండి అని మంత్రి కోరారు. మీ మద్దతు కోసం వచ్చాను. మా లాంటి చిన్న పార్టీలకు..మీలాంటి వాళ్ల మద్దతు కావాలి. అటు ఎపి ఇటు తెలంగాణను కేంద్రం మోసం చేసింది. ఏపీకి ఇచ్చినట్టు తట్టెడు మట్టి..లోట్టేడు నీళ్లు కూడా తెలంగాణకు ఇవ్వలేదు. హైదరాబాద్‌లో చదువుకున్న వాళ్ళు ఓటు వేయారని పేరు ఉంది. ఓటు వేయరో,ఓటింగ్ రారో వారికి ప్రశ్నించే హక్కు ఉండదు. మాకు హైదరాబాద్ ప్రజల ఆశీర్వాదం కావాలి. టీఆర్‌ఎస్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి కేటీఆర్‌ కోరారు.

- Advertisement -