KTR:పాలమూరులో ఓటమి దిశగా కాంగ్రెస్

11
- Advertisement -

24 ఏళ్ళు ఆందోళన పథంలో 10 సంవత్సరాలు ప్రభుత్వ పాలన దూసుకుపోయామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీఆర్ఎస్ ఆవిర్భావం సందర్భంగా చిట్‌ చాట్‌గా మాట్లాడిన కేసీఆర్..2023 ఎన్నికల తర్వాత ఇప్పటికీ వరకు కేసిఆర్ ను తలుచుకోని రోజు లేదు అన్నారు.ప్రతి ఇంటా ఇదే పరిస్తితి..
రేవంత్ రెడ్డి ఆయన పార్లమెంట్ నియోజకవర్గం లో గల్లి గల్లి కి తిరుగుతున్నాడన్నారు.

ఆయనకు వ్యతిరేకత ఉందని అర్దం అయ్యింది..కాంగ్రెస్ పై తీవ్ర వ్యతిరేకత వస్తోందన్నారు. మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ లో ఓటమి అంచులో ఉందని..బజారు భాష మాట్లాడుతూ, చిల్లరగా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారన్నారు. ఆరు గ్యారంటీ లు పక్కన పెట్టారు…ఇచ్చిన హామీలు మొత్తం నీరుగారిందన్నారు.మనం మోసం పోయాము అని రేవంత్ రెడ్డికి అర్దం అయ్యింది…రేవంత్ రెడ్డి సీక్వెన్స్ మోసాలు సినిమాలు చూపిస్తున్నాడన్నారు.

దేవుడి మీద ఒట్లు పెడుతూ, ఆగస్టు 15న రైతు రుణమాఫీ చేస్తానని మోసం చేస్తున్నాడు..కొండంగల్ లో ఓడితే రాజకీయ సన్యాసం అన్నాడు కదా..కేంద్రంలో అధికారం లోకి వస్తేనే ఆరు గ్యారంటీ లు అంటున్నారు.ఆయన అసెంబ్లీ ఎన్నికల ముందు మోసం పార్ట్ 1…ఇప్పుడు మోసం పార్ట్ 2 నడుస్తోంది అనిపిస్తుందన్నారు.

Also Reda:KCR:ట్విట్టర్‌ ‘ఎక్స్’లోకి బీఆర్ఎస్ అధినేత

- Advertisement -