ఇంటిపై 16 అడుగుల పైథాన్..వైరల్

31
- Advertisement -

ఆస్ట్రేలియాలో ఓ ఇంటి పై కప్పుపై 16 అడుగుల పైథాన్ భయబ్రాంతులకు గురి చేసింది. ఇంటి పై నుండి ఓ చెట్టుపైకి వెళ్తున్న పైథాన్ వీడియోని ఓ మహిళ తన సెల్ ఫోన్‌లో బంధించింది. దీంతో వీడియో త్వరలోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌లో ఈ ఘటన జరిగింది. భారీ కొండచిలువను చూడటంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. చెట్లపై కొండచిలువలను చూడటం చాలా సాధారణం అని స్నేక్ క్యాచర్ తెలిపారు.

- Advertisement -