‘మహానటి’ ఫోటోను రివీల్‌ చేసిన షాలిని…

256
- Advertisement -

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, షాలిని పాండే ప్ర‌ధాన పాత్ర‌ల‌లో అర్జున్ రెడ్డి అనే చిత్రం విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది. ఆ సినిమాలో హీరోయిన్ నటించిన షాలినీ పాండే మంచి గుర్తింపు సంపాదించుకుంది. బోల్డ్ మూవీలో దాదాపు సైలెంట్ క్యారెక్టర్ చేస్తూనే.. పద్ధతిగా కనిపిస్తూనే బోల్డ్ నెస్ చూపించాల్సిన పాత్రలో.. షాలినీ జనాలను మెస్మరైజ్ చేసింది. ఈ మూవీ తర్వాత షాలిని వరుసగా అవకాశాలు అందుకుంటుంది.

Arjun Reddy Beauty Shalini in Mahanati

తాజాగా ఈ అమ్మడు సావిత్రి జీవితకథపై తెరకెక్కుతున్న ‘మహానటి’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ స్పెషల్ పిక్ ను పోస్ట్ చేసింది ఈ భామ. మహానటి షూటింగ్ స్పాట్ లో తీసిన ఈ పిక్ సెన్సేషన్ అవడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఎందుకంటే ఈ ఫోటోలో షాలినీ పాండేతో పాటు కీర్తి సురేష్ కూడా ఉంది. ఇప్పటివరకూ మహానటికి సంబంధించిన స్టిల్స్ చాలానే వచ్చాయ్ కానీ.. అవేవీ అఫీషియల్ కాదు. గతంలో బయటకు వచ్చిన లుక్స్ మహానటి మూవీకి సంబంధించినవి కావని.. ఆ పాత్ర చేస్తున్న కీర్తి సురేష్ స్వయంగా చెప్పేసింది.

Arjun Reddy Beauty Shalini in Mahanati

కానీ ఇప్పుడు షాలినీ పాండే రివీల్ చేసిన ఫోటోలో సావిత్రి లుక్ తో పాటు షాలినీ గెటప్ కూడా తెలిసిపోయింది.ఈ ఫోటోలో సావిత్రి గెటప్‌లో కీర్తి సురేష్ కనిపిస్తుండగా.. పక్కనే మేకప్ వేయించుకుంటూ షాలినీ పాండే ఈ పిక్చర్ లో ఉంటుంది. గెటప్ చూస్తే సినిమాలో ఈమె జమున పాత్ర చేస్తోందని అర్ధం అయిపోతుంది. తన 100వ ట్వీట్ తో అందరినీ ఆనందింప చేస్తానని ముందే చెప్పిన షాలినీ పాండే.. ఇలా అందరికి షాక్‌కు గురి చేసింది.

- Advertisement -