రెజీనా లవ్ ఫెయిల్యూర్ నిజమేనట..

269
regina_cassandra-
- Advertisement -

రొటీన్ లవ్ స్టోరీ సినిమాతో తెలుగు తెరకు పరిచయమై…అనతికాలంలోనే దక్షిణాది సినీ పరిశ్రమలోకి తారాజువ్వలా దూసుకొచ్చిన తారల్లో రెజీనా కసాండ్రా ఒకరు. సినీ పరిశ్రమలో ప్రవేశించిన తొలినాళ్లలోనే వరుస విజయాలు రెజీనాను పలుకరించాయి.జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు తీస్తూ.. దాదాపు కుర్ర హీరోయిలందరితో జోడి కట్టింది. అలాగే మలయాళం లో కూడా ఈ చెన్నై సుందరి మంచి ఆదరణను దక్కించుకుంది.

regina_cassandra-

కాకపోతే ఈ మధ్యనే వచ్చిన నక్షత్రం కోసం ఎంతగా అందాలను ఆరబోసినా కూడా సినిమా మిస్ ఫైర్ అయ్యింది. రెజీనా కెరీర్ ఎందుకో ఒడిదుడుకులకు లోనైంది. అందుకు కారణం ఓ మెగా హీరోతో ప్రేమలో పడిందనే వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఆ హీరో ప్రముఖ హీరోల కుటుంబానికి చెందినవాడని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రేమ, పెళ్లి అంశాల మధ్య రెజీనా నలిగిపోయింది. దాంతో ఆమె స్టార్‌డమ్‌కు గండిపడింది. ఆమె తర్వాత ఇండస్ట్రీలోకి వచ్చిన హీరోయిన్లందరూ అగ్రతారలుగా కొనసాగడం విశేషం.

regina_cassandra-

అయితే  ప్రస్తుతం ప్రేమ మత్తు వదిలిందని  కెరీర్ ఆరంభంలోనే ప్రేమలో పడటం వల్ల తెలియకుండా కొన్ని తప్పులు జరిగిపోయాయని రెజీనా తెలిపినట్టు ఓ వార్త ఇంటర్నెట్‌లో ప్రచారం జరుగుతున్నది.  మరి ఈ వార్తలు ఎంతవరకు నిజమో తెలియదు గాని వీటిపై రెజీనా అధికారికంగా ఏ విధమైన కామెంట్స్ చేయలేదు.

- Advertisement -