వందో టీ20 ఆడిన స్మృతి…భారత రెండో మహిళా క్రికెటర్‌గా ఘనత

208
- Advertisement -

భార‌త మ‌హిళా క్రికెటర్, లెఫ్ట్‌ హ్యండ్‌ స్టైలిష్ బ్యాట‌ర్ స్మృతి మంద‌న అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. భార‌త్ త‌ర‌ఫున 100 అంత‌ర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడిన రెండో మ‌హిళా బ్యాట‌ర్‌గా ఘ‌న‌త ద‌క్కించుకుంది. ఆసియాక‌ప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌లోని సిల్‌హెట్‌లో థాయ్‌లాండ్ జ‌ట్టుతో జ‌రిగిన టీ20 మ్యాచ్ ద్వారా స్మృతి మంద‌న ఈ ఫీట్ సాధించింది.

స్మ‌తి మంద‌న కంటే ముందు స్కిప్ప‌ర్ హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ 100 టీ20 మ్యాచ్‌ల మైలురాయిని అధిగ‌మించారు. మొత్తం 135 మ్యాచ్‌లు ఆడిన హ‌ర్మ‌న్‌ప్రీత్ కౌర్‌.. 27.28 స‌గ‌టుతో 2,647 ప‌రుగులు చేసింది. అందులో ఒక సెంచ‌రీ, 8 అర్ధ సెంచ‌రీలు ఉన్నాయి. అటు బౌలింగ్‌లోనూ రాణించి 32 వికెట్ల‌ను త‌న ఖాతాలో వేసుకుంది. వందో టీ20 మ్యాచ్ ఆడిన స్మృతి మంద‌న మొత్తం 26.96 స‌గ‌టుతో 2,373 ప‌రుగులు చేసింది. అందులో 17 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. బెస్ట్ స్కోర్ 86 ప‌రుగులు.

వ‌ర‌ల్డ్‌వైడ్‌గా ఎక్కువ ఇంట‌ర్నేష‌నల్‌ టీ20లు ఆడిన రికార్డు న్యూజీలాండ్ మ‌హిళా బ్యాట‌ర్ సుజీ బేట్స్ పేరిట ఉంది. ఆమె మొత్తం 136 మ్యాచ్‌లు ఆడింది. ఆ త‌ర్వాత స్థానాల్లో హ‌ర్మ‌న్ ప్రీత్ (135), ఇంగ్లండ్‌కు చెందిన డానియెల్లీ వ్యాట్ (135), ఆస్ట్రేలియాకు చెందిన అలిస్సా హీలీ (132), వెస్టిండీస్‌కు చెందిన డీండ్రా డాట్టిన్ (127) ఉన్నారు.

- Advertisement -