సోషల్ మీడియాలో వైరల్‌గా స్మృతీ ఫొటో

320
Smriti Irani goes viral
- Advertisement -

ఎప్పుడూ బిజీ బిజీ జీవిత‌మేనా…? కొంచెం జీవితానికి ఎంట‌ర్ టైన్ మెంట్ కూడా ఉండాలిగా.. ఇప్పుడు ఇదే పార్ములాని అక్షరాలా పాటిస్తోంది కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ. ఇటీవల బిజీ లైఫ్ ను కాస్త ప‌క్క‌న బెట్టి ఎంజాయ్ మూడ్ లోకి వచ్చిన స్మృతీ…. పారా గ్లిడింగ్ చేసి అంద‌రినీ ఉత్సాహ‌ప‌రిచారు. భార‌త‌దేశ పారాగ్లైడింగ్ రాజ‌ధాని బిర్ బిల్లింగ్ నుంచి గ్లైడ్ చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యా… కొంత‌మంది అనుకోవ‌చ్చు…నేను మ‌ళ్లీ భూమ్మీదికి రావ‌డం చాలా సులువ‌ని (లావుగా ఉండ‌టం వ‌ల్ల ల్యాండింగ్ సులువని ఆమె ఉద్దేశం)  పోస్ట్ చేసి హాస్యాన్ని పంచిన స్మృతీ తాజాగా తన గతాన్ని గుర్తుచేసుకుంది.

Smriti Irani goes viral
పెళ్లైన కొత్తలో భర్త జుబెన్‌ ఇరానీతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసింది స్మృతీ. ఈ ఫోటోలో వీరి జంటను చూసిన నెటిజన్లు తెగ ముచ్చటపడిపోతున్నారు. దీంతో ఇప్పుడు ఈ ఫోటో వైరల్‌గా మారింది.  స్మృతీ కపుల్‌కు విషెస్ చెబుతున్నారు.

రాజకీయాల్లోకి రాకముందు స్మృతీ  అందాల పోటీల్లో, తర్వాత సాంగ్ ఆల్బమ్స్‌లో దర్శనమిచ్చిన సంగతి తెలిసిందే. బుల్లితెరపై  ఏక్తాకపూర్ డైలీ సీరియల్ క్యోంకీ సాస్ భీ కభీ  బహు థీ సిరీయల్‌ తులసి పాత్ర ఆమె జీవితాన్ని మార్చేసింది. అక్కడి నుంచి స్టార్‌ ప్లస్‌లోకి అడుగుపెట్టిన స్మృతీ తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో తెరకెక్కిన జై భోలో తెలంగాణ చిత్రంలో కూడా నటించింది.  వరుసగా ఐదుసార్లు ఉత్తమ నటిగా ఇండియన్ టె లివిజన్ అవార్డులు గెలుచుకుంది.

గతంలో కూడా  అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వం సంద‌ర్భంగా త‌ను యోగా చేస్తున్న ఫొటో పెట్టి `లావుగా ఉన్న‌వాళ్లు శ‌రీరాన్ని వంచ‌లేర‌ని ఎవ‌రు చెప్పారు?` అంటూ పోస్ట్ చేశారు. ఏదిఏమైనా అటు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలను పంచుకుంటునే ఉంటోంది.

- Advertisement -