గాలే టెస్ట్..పట్టుబిగించిన భారత్

190
- Advertisement -

శ్రీలంకతో గాలే జరుగుతున్న తొలి టెస్ట్‌లో భారత్ పట్టుబిగించింది. భారత బౌలర్లు అతిథ్య లంక బ్యాట్స్‌ మెన్స్‌ని ముప్పు తిప్పలు పెట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 600 పరుగులు చేయగా అందులో సగం కూడా శ్రీలంక బ్యాట్స్ మెన్ చేయలేకపోయారు. 291 పరుగులు చేసి చాపచుట్టేశారు. దీంతో టీమిండియాకు 309 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది. శ్రీలంక గడ్డపై భారత్‌కు ఇదే అత్యధిక ఆధిక్యం కావడం విశేషం.

తర్వాత రెండో ఇన్నింగ్స్ ను భారత్ దూకుడుగా ప్రారంభించింది. మొదటి ఇన్నింగ్స్‌లో 190 పరుగులతో రాణించిన శిఖర్‌ ధావన్‌(14) సెకండ్‌ ఇన్నింగ్స్‌లో వేగంగా ఆడే ప్రయత్నంలో త్వరగా ఔటయ్యాడు. తర్వాత వచ్చిన పుజారా కూడా 15 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ బాట పట్టాడు. ఈ క్రమంలో వరణుడు మ్యాచ్ అడ్డంకిగా మారడంతో అంపైర్లు తాత్కాలికంగా మ్యాచ్‌ని నిలిపివేశారు.

India lead by 498 runs

దాదాపు రెండు గంటల తర్వాత వర్షం ఆగడంతో మ్యాచ్‌ తిరిగి ప్రారంభమైంది. తొలి ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోరుకే వెనుదిరిగి విమర్శల పాలైన అభినవ్ ముకుంద్ తనేంటో నిరూపించాడు. 116 బంతుల్లో 81 పరుగులు చేసి గుణతిలక బౌలింగ్‌లో ఎల్బీడ్యబ్లుగా వెనుదిరిగాడు. కెప్టెన్ విరాట్ కోహ్లి 76 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు. మూడో రోజు ఆటముగిసే సమయానికి భారత్ 3 వికెట్ల నష్టానికి 189 పరుగుల చేసి 498 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఇంకా రెండు రోజుల ఆట మిగిలి ఉండటం,లంకకు భారీ టార్గెట్ విధించడంతో విజయావకాశాలు భారత్‌ వైపు మెండుగా ఉన్నాయి.

- Advertisement -