కోల్ బెల్ట్ ఏరియా ప్రగతికి సింగరేణి సహకారం

283
balka suman

కోల్ బెల్ట్ ఏరియా ప్రగతికి సింగరేణి సహకారం అందిస్తామని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. కోల్ బెల్ట్ ఏరియా ఎమ్మెల్యేలు, ఎంపీలతో మంత్రి కొప్పుల సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సిఎండి శ్రీధర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు కొప్పుల. సింగరేణి యాజమాన్యం,సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను ఇప్పటివరకు తీసుకున్న చర్యల పట్ల ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.

ఇంకా కొన్ని సమస్యలు పరిస్కారం చెయ్యాలని ప్రజాప్రతినిధులు అధికారులకు సూచించారు. వైద్య సదుపాయాలు,సింగరేణి ఏరియా గ్రామాలలో మౌలిక సదుపాయాలకు కృషి చేయాలన్నారు. అన్ని సమస్యలపై సానుకూలంగా స్పందించారు సింగరేణి సీఎండీ శ్రీధర్.