కారు ప్ర‌మాదంపై స్పందించిన హీరో రాజ‌శేఖ‌ర్..

625
- Advertisement -

సీనియర్ హీరో రాజ‌శేఖ‌ర్ కారుకి ప్ర‌మాదం జ‌రిగింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ రోడ్ ఔటర్ రింగ్ రోడ్డుపై అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ప్రమాదం విజయవాడ నుండి హైదరాబాద్ రాజశేఖర్‌ తన కారులో వస్తుండగా పెద్ద గోల్కొండ ఔటర్ రింగ్ రోడ్డుపై కారు టైర్ పగిలి డివైడర్‌ను ఢీకొని పల్టీ కొట్టినట్లు తెలుస్తోంది.

కారు ప్రమాద ఘటనపై స్పందించారు రాజశేఖర్.  తనకు ఎటువంటి గాయాలు కాలేదని, తాను క్షేమంగా ఉన్నానని  వెల్లడించారు.

Hero Rajasekhar

మంగళవారం రాత్రి రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి ఇంటికి వస్తుండగా, ఔటర్ రింగ్ రోడ్డులో పెద్ద గోల్కొండ, అప్పా జంక్షన్ వద్ద తన కారు ప్రమాదానికి గురైందని చెప్పారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో తానొక్కడినే ఉన్నానని…తనను గుర్తుపట్టి విన్ షీల్డ్ లో నుంచి బయటకు లాగారని చెప్పారు.

తొలుత పోలీసులకు, తరువాత నా కుటుంబ సభ్యులకు సమాచారం అందించానని చెప్పిన రాజశేఖర్..తనకు సాయం అందించిన వారి కారులో ఇంటికి చేరుకున్నానని..తనకు ఎలాంటి గాయాలు కాలేదన్నారు.

- Advertisement -